తానా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు”

Related image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వ్యావహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వేంకట రామమూర్తిగారి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాల దృశ్య సమావేశంలో “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు” శనివారం, ఆదివారం ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు ఘనంగా జరుగనున్నాయని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా, శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా ఉన్న మన తెలుగు సంతతికి చెందిన డా. శశి పిల్లలమర్రి (పంజా) ముఖ్య అతిధి గాను, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న మరో తెలుగు తేజం డా. బొప్పూడి నాగ రమేశ్, ఐ.పి.ఎస్ ప్రత్యేక అతిధిగాను, ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు తనికెళ్ళ భరణి విశిష్ఠ అతిధిగా శనివారం పాల్గొంటున్నారు. భరణి రచించిన “ఎందరో మహానుభావులు” అనే గ్రంధం సత్య భావన ఆంగ్లానువాదం చేసిన గ్రంధాన్ని డా. పంజా ఆవిష్కరిస్తారు. ఆదివారం రోజున “ప్రసార భారతి” (సి ఇ ఓ) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ శశి శేఖర్ వెంపటి, సిడ్నీ ఒలంపిక్స్ వెయిట్‌ లిఫ్టింగ్‌ కాంస్య పతక గ్రహీత మరియు ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం ఉపకులపతి పద్మశ్రీ డా. కరణం మల్లీశ్వరి ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎంతోమంది లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తల జీవిత ప్రస్థానాలను ఈ సభలో వారి కుటుంబసభ్యులే ఆవిష్కరించడం సాహితీ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టమని, శనివారం నాడు - డా. తుమ్మల సీతారామమూర్తి చౌదరి, డా. రాయప్రోలు సుబ్బారావు, డా. కొండవీటి వేంకట కవి, డా. ముళ్ళపూడి వెంకటరమణ, డా.
గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా, పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి కుటుంబసభ్యులు మరియు ఆదివారం నాడు కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి, పద్మభూషణ్ డా. బోయి భీమన్న, శ్రీ గురజాడ అప్పారావు, రాష్ట్రేందు డా. గుంటూరు శేషేంద్రశర్మ, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు, పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ, డా. రావూరి భరద్వాజ, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కుటుంబసభ్యులు పాల్గొని ఎన్నో అసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారని అందరికీ ఆహ్వానం పలికారు.

ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 లకు ప్రారంభం అవుతుందని ఈ క్రింది వివిధ మార్గాల ద్వారా వీక్షించవచ్చని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలియజేశారు.

1. TANA TV Channel – in YuppTV
2. Facebook: https://www.facebook.com/tana.org
3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
4. www.youtube.com/tvasiatelugu
5. www.youtube.com/manatv

మిగిలిన వివరాలకు: www.tana.org


Tana
Anjaiah CHoudary Lavu
Prasad Thotakura
Chigurumamilla Srinivas
USA
Tanikella Bharani
Karanam Malleeswari

More Press Releases