విజయవాడలో స్పెన్సర్ మాల్ కు రూ.10వేల జరిమానా.. నోటీసులు జారీ
- కోవిడ్ నియమాలు పాటించాలి: నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తగ్గుతున్న క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే, కేసులు సంఖ్య పెరిగె ప్రమాదం ఉందన్నారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. గుంపులుగా గుమిగూడకుండా ఉండాలి. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్నారు. నగరంలోని మూడు సర్కిల్ కార్యాలయాల పరిధిలో లాక్ డౌన్ సడలించిన సమయాలలో ప్రజానీకం ఎవరైనా కోవిడ్ నియమాలు పాటించకుండా, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వచ్చు వారిని గుర్తించి వారికీ అవగాహాన కల్పించుడంతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఇందుకు గాను మూడు మొబైల్ టీమ్ ను ఏర్పాటు చేయుడం జరిగిందన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా భాగస్వాములు కావాలన్నారు.