దేశం గర్వించే విధంగా అనాథల సంరక్షణ కోసం అద్భుత విధానం: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో దేశం గర్వించే విధంగా అనాథల సంరక్షణ కోసం అద్భుత విధానం రానుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరుగుపరచి, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, బాల నేరస్తుల శాఖ సంచాలకులు శైలజా నేడు రాష్ట్రంలోని కొన్ని అనాథ పిల్లల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం అయ్యారు.

అనాథలకు ప్రభుత్వమే తల్లిదండ్రిగా ఉండి, సంరక్షణ చేపట్టి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తీసుకొచ్చే నూతన విధానంలో ఎలాంటి అంశాలు ఉండాలో చెప్పాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు.

ఈ అభిప్రాయాలన్నిటిని క్రోడీకరించి కేబినెట్ సబ్ కమిటీ లో చర్చిస్తామని, అత్యుత్తమ విధాన రూపకల్పన కోసం ప్రతిపాదనలు సమర్పిస్తామని అన్నారు.

Satyavathi Rathod
KCR
Telangana

More Press Releases