కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల్లో జాగ్రత్తలు పాటించండి: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
- సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్ తనిఖీ
- నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
121, 123, 124 సచివాలయల తనిఖీ:
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం భవానీపురం లారీ స్టాండ్, బొబ్బరి గ్రౌండ్స్ నందలి 121 & 123,124 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.