జై తెలంగాణ టీవీ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించిన టీం

Related image

హైదరాబాద్, ఆగస్టు 14: ప్రతిష్టాత్మకంగా త్వరలోనే ప్రారంభించబోతున్న "జై తెలంగాణ టీవీ" యాప్ ఆవిష్కరణకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను జై తెలంగాణ టీవీ బృందం ఆహ్వానించింది.

ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి జై తెలంగాణ టీవీ యాప్ ఆవిష్కరణకు రావలసిందిగా గవర్నర్ ను ఈ యాప్ ప్రమోటర్లు ఆహ్వానించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, చరిత్రను ప్రతిబింబించేలా ఈ యాప్ కృషి చేస్తుందని డాక్టర్ తమిళిసై కి వివరించారు.

తెలంగాణకు ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలు, అద్భుతమైన భవిష్యత్తు ఉన్నదని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు.

తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను, పండుగలను, చారిత్రక విశేషాలను ఈ యాప్ ద్వారా  తెలియజేయడానికి కృషి చేయడం అభినందనీయమని గవర్నర్ అన్నారు.

ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వారిలో పూజారి రవి గౌడ్, శ్రీహిత, శ్రీ హర్షిత, రాజు యాదవ్ తదితరులు ఉన్నారు.

Tamilisai Soundararajan
Hyderabad
Telangana

More Press Releases