సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్
విజయవాడ: ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాష్ నగర్ నందలి 268 & 269 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
టిడ్కో భవన సముదాయాలను పరిశీలించిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్):
సింగ్ నగర్ వాంబే కాలనీ ప్రాంతములో నూతనంగా నిర్మిస్తున్న జి 3 టిడ్కో భవన సముదాయాలను శుక్రవారం యూనియన్ బ్యాంక్ డీజీఎం వేగే రమేష్, యూనియన్ బ్యాంక్ కో-ఆర్డినేటర్ మురళి కృష్ణ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణతో కలసి క్షేత్ర స్థాయిలో నిర్మాణాలు పరిశీలించారు. ఈ సందర్బంలో టిడ్కో నిర్మాణ పనులకు సంబందించి ప్లాన్లు, డిజైన్ లతో పాటుగా నిర్మాణము యొక్క నాణ్యత మొదలగు అంశాలను పరిశీలించిన బ్యాంక్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.