మహిళల రక్షణ కోసం దిశ యాప్.. కార్పొరేటర్లకు దిశ పోలీస్ అధికారులచే పవర్ పాయింట్ ప్రెజంటేషన్

Related image

  • మహిళల రక్షణ కోసం దిశ యాప్: రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
  • ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: ఎమ్మెల్యే మల్లాది
  • ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరం: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ: దిశ యాప్ ఉంటే అన్న మన తోడు ఉన్నట్లే అనే భావనను కలిగే విధంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. శుక్ర‌వారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు మహిళల భద్రత‌కు ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దిశ ఎస్ఓఎస్ మొబైల్ యాప్ పై కార్పొరేటర్ లకు దిశ పోలీస్ అధికారులచే పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సందర్బంలో దిశ పోలీస్ స్టేషన్ అధికారులు మొబైల్ నందు ఎస్ఓఎస్ యాప్ డౌన్ లోడ్ చేసుకొనే విధానము మరియు ఆపద సమయాలలో దానిని ఏ విధంగా వినియోగించాలి అనే అంశాలను క‌మిష‌న‌ర్ వివ‌రించారు. యాప్ కేవలం మహిళలు మాత్రమే కాకుండా మగ వారు కూడా మీ యొక్క మొబైల్ నందు డౌన్ లోడ్ చేసుకొనిన, మహిళలు ఆపద సమయంలో వారికీ తోడుగా ఉండుటకు ఎంతో దోహదకారిగా ఉంటుందన్నారు.

మంత్రి మాట్లాడుతూ దిశ యాప్ యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాల‌న్నారు. ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి ప్రతి కార్పొరేటర్ ఒక యజ్ఞంలా తీసుకోని డివిజన్ ప్రజలందరికి దిశ యాప్ వల్ల ఉపయోగాలను దానిని ఆపరేట్ చేసే విధానం మొదలగు అంశాలను వివరించి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఒక్కరు మొబైల్ నందు ఈ దిశ ఎస్ఓఎస్ మొబైల్ యాప్ ఉండేలా కృషి చేయాలన్నారు.


సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాట్లాడుతూ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖా ఎంతో ప్రతిష్టాత్మకoగా ఆపద సమయాలలో ఆదుకోనేలా ఈ దిశ యాప్ మహిళల కొరకు అందుబాటులోనికి తీసుకురావటం జరిగిందన్నారు.

కార్పొరేటర్లుగా నగరాభివృధికి కృషి చేస్తున్న మీరు మరియు సచివాలయాల సిబ్బంది నిత్యం ప్రజలతో కలసి పని చేస్తూ ఉంటారని, మీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజానికానికి ఈ యాప్ యొక్క విశేషాలు వివరించాలని అన్నారు. ఆపద వచ్చినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వివరించారు. స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలన్నారు. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టేనని.. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అన్నారు. 

Vijayawada
Vellampalli Srinivasa Rao
malladhi vishnu
YSRCP
Andhra Pradesh

More Press Releases