సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి: విజయవాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్

Related image

విజయవాడ: న‌గ‌రంలోని వార్డు స‌చివాల‌యాల్లోని కార్య‌ద‌ర్శులు స‌కాలంలో విధుల‌కు హాజ‌రుకావాల‌ని, సచివాలయాల సిబ్బంది నిబద్ద‌త‌తో ప‌నిచేసి, అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు.

న‌గ‌ర ప‌రిధిలోని 11 వార్డులో 45వ స‌చివాల‌యం, 10 వార్డులో 48వ స‌చివాల‌యాల‌ను మంగ‌ళ‌వారం క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. కార్య‌ద‌ర్శుల హ‌జ‌రు ప‌ట్టి, వారి జాబ్ చార్టుల‌ను, డైరీని, ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆర్టీల‌ను ప‌రిశీలించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌నే ఉద్దేశ్యంతో వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. దానిని కార్య‌ద‌ర్శులు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించేందుకు కృషి చేయాల‌న్నారు.

కార్య‌ద‌ర్శులు స‌చివాల‌యంలో ఉండి ప్ర‌జ‌ల నుంచి వచ్చిన ఫిర్యాదుల‌ను, ఆర్జీల‌ను పెండింగ్‌లో ఉంచ‌కుండా వెంట‌నే న‌మోదు చేసి పై అధికారుకులకు పంపాల‌న్నారు. శానిట‌రీ కార్య‌ద‌ర్శులకు సంబందించి 11 రిజిష్ట‌రుల‌ను ప‌రిశీలించారు. శానిట‌రీ కార్య‌ద‌ర్శులు వార్డులో ప‌ర్య‌టించి డోర్ టు డోర్ చెత్త సేక‌ర‌ణ‌, కాలువ‌లు రోడ్డు శుభ్రం చేయించాల‌న్నారు. హెల్ల్ సెక్ర‌ట‌రీలు ప్రతి ఇంటికి వెళ్లి జ‌ర్వ‌ ల‌క్షణాలు ఉన్న వారిని గుర్తించి, వారి వివ‌రాల‌ను పై అధికారుల‌కు  తెలియ‌జేయాల‌న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకములకు సంబంధించి వివరాలు డిస్ ప్లే బోర్డు నందు ఉంచాల‌న్నారు. 

More Press Releases