సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్
విజయవాడ నగర పరిధిలోని వార్డు సచివాలయాలను శుక్రవారం నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. సూర్యరావుపేట శ్రీ కర్ణాటి రామ్ మోహన్ రావు మున్సిపాల్ కార్పొరేషన్ హై స్కూల్ ఆవరణలో గల 91, 92, 93, బ్రహనందరెడ్డి షాపింగ్ కాంపెక్స్ నందు గల 34, 35 సచివాలయాలను మరియు మారుతి నగర్లో 29, 30, 31 సచివాలయలను కమిషనర్ తనిఖీ చేసి, కార్యదర్శుల హజరు పట్టి, వారి జాబ్ చార్టులను, డైరీని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దానిని కార్యదర్శులు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు.
కార్యదర్శుల వారి జాబ్ చార్టు ఆధారంగా చేసిన పనిని వెంటనే డైరీలో పొందుపరచాలన్నారు. బయట విధులు నిర్వర్తించుటకు వెళ్లినప్పడు మూమెంట్ రిజిష్టర్‌లో పూర్తి వివరాలు వ్రాయాలన్నారు. కార్యదర్శులు సచివాలయంలో ఉండి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, ఆర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే నమోదు చేసి పై అధికారికి పంపాలన్నారు. శానిటరీ కార్యదర్శులు వార్డులో పర్యటించి డోర్ టు డోర్ చెత్త సేకరణ, కాలువలు రోడ్డు శుభ్రం చేయించాలన్నారు. హెల్ల్ సెక్రటరీలు ప్రతి ఇంటికి వెళ్లి జర్వలక్షణాలు ఉన్నావారిని గుర్తించి, వారి వివరాలను పై అధికారులకు తెలియజేయాలన్నారు.
అదే విధంగా క్రమం తప్పకుండా పట్టణ ఆరోగ్య పరిశుద్ద్య మరియు పోషక ఆహర కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. హెల్త్ సెక్రటరీలు వార్డు పరిధిలో కోవిడ్ పరిక్షలు నిర్వహించడం చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకములకు సంబంధించి వివరాలు డిస్ప్లే బోర్డును పరిశీలించి, పలు ఆదేశాలు ఇచ్చారు.