కేబీఆర్ పార్కులో మొక్కలు నాటిన తెలంగాణ సీఎస్

Related image

హైదరాబాద్: నగరంలోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్)ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పార్కులోని నడక దారి (వాకింగ్ ట్రాక్)ని పరిశీలించారు. పార్కుకు వచ్చే సందర్శకుల కోసం చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

అటవీ పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా పార్కులో చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు సీఎస్ కు వివరించారు. డ్రోన్ ల ద్వారా ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీడ్ బాల్స్ వదిలే కార్యక్రమంపై ఆసక్తి కనబరచారు.

పీసీసీఎఫ్ శోభ, పీసీసీఎఫ్ ఎస్.శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు సిధ్దానంద్ కుక్రేటి, ఎంసి పర్ గెయిన్, వినయ్ కుమార్, హైదరబాద్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్, రంగారెడ్డి ఫారెస్ట్ కన్జర్వేటర్ సునితా భగవత్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అటవీ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Haritha Haaram
Somesh Kumar
KBR National Park
Hyderabad
Telangana

More Press Releases