పున్నమి, భ‌వానీఘాట్ వ‌ద్ద‌ గ్రీన‌రీ అభివృద్ది చేయాలి: విజయవాడ న‌గర పాలక సంస్థ క‌మిష‌న‌ర్

Related image

విజయవాడ: కృష్ణా న‌ది వెంబ‌డి కీలకమైన ఘాట్లను అభివృద్ది చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని న‌గర పాలక సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐఏఎస్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి భ‌వానీఘాట్ నందు విద్యుత్ దహాన శ్మశాన వాటిక ప‌నుల‌ను ప‌రిశీలించి, అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు.

అనంత‌రం పున్నమి, భ‌వానీఘాట్ ల‌ను ప‌రిశీలించి ఈ ప్రాంతంలో గ్రీన‌రీ పెంపుతో పాటుగా పార్క్ అభివృద్ది చేయ‌డం.. అదే విధంగా ఈ ప్రాంత‌లో చిన్నారుల కోసం సైకిలింగ్ ట్రాక్‌, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయ‌ల‌న్నారు.

ప‌ర్య‌ట‌న‌లో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి కుమార్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases