ఆధునిక హంగులతో జగనన్న కాలనీలు: దేవినేని అవినాష్

Related image

విజయవాడ: కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేసి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గ్రౌండింగ్ లో భాగంగా శనివారం అద‌న‌పు క‌మిష‌న‌ర్ (జ‌న‌ర‌ల్‌) డాక్ట‌ర్ జె.అరుణ ఆధ్వర్యంలో వణుకురు నందు 2198 ఇళ్ల స్థలాలు చెందిన లబ్ధిదారులతో పక్క గృహాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయ‌డం జ‌రిగింది.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో దాదాపు ముప్పైవేల మందికి ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ఏకంగా కాలనీల పేరుతో గ్రామాలనే నిర్మిస్తున్న జగన్ గారి కృషి చిరస్థాయిగా నిలిచిపోతుంద‌న్నారు. మహిళల కళ్ళల్లో సంతోషం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు, ఇంచార్జిలు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Devineni Avinash
Vijayawada
Andhra Pradesh
Jagan
YSRCP

More Press Releases