ఆరంఘర్ నుండి ఎయిర్ పోర్టుకు అనుసంధానించే రహదారి వరకు విస్తృతమైన ప్లాంటేషన్ చేపట్టాలి: తెలంగాణ సీఎస్

Related image

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ), జీహెచ్‌ఎంసీ అధికారులతో శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఆరంఘర్ (పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే) నుండి ఎయిర్ పోర్టుకు అనుసంధానించే రహదారి వరకు విస్తృతమైన ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రహదారికి ఇరువైపుల పుష్పించే మొక్కలతో మల్టీకలర్/మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ ను చేపట్టాలని ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు హరిత అనుభవాన్ని అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై బుద్వేల్ వద్ద జీహెచ్ఎంసీ ద్వారా చేపట్టిన మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు.

ఈ సమావేశంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్&బీ, ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ GoI ప్రాంతీయ అధికారి ఎస్.కె ఖుష్వా, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ దర్మారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Somesh Kumar
Hyderabad
Telangana

More Press Releases