'డ్రూమ్' దీపావళి ఆటోమేళా: 2-వీలర్ విక్రయాలు రూ.999, లగ్జరీ కార్లు రూ.99,999
2-వీలర్ విక్రయాలు రూ.999లతో, లగ్జరీ కార్లు రూ.99,999లతో డ్రూమ్ తన 5వ "దీపావళి ఆటోమేళా"ను ప్రకటిస్తోంది
ఈ దీపావళి ఆటో మేళా సమయంలో డీల్స్, డిస్కౌంట్స్ కోసం డ్రూమ్ రూ.50 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది
- విక్రయాలు 6 సెప్టెంబర్ నుండి 8 సెప్టెంబర్ 2019 వరకు అన్ని విభాగాలలో అద్భుతమైన ఆఫర్స్ తో లైవ్ లో ఉంటాయి
పండుగ షాపింగ్ సీజన్ అమోఘంగా ప్రారంభించడానికి, డ్రూమ్, భారతదేశంలోనే అతి పెద్ద, ప్రముఖ ఆన్ లైన్ ఆటోమొబైల్ లావాదేవీల మార్కెట్ ప్లేస్, తన వార్షిక ’దీపావళి ఆటోమేళా’ను ఆవిష్కరించింది. ఈ విక్రయాలు, సెప్టెంబర్ 6 నుండి నవంబర్ 8 వరకు లైవ్ లో నడవబోతోంది. ఇది ఈ సంవత్సరంలో మరింత పెద్దది, మెరుగైనది. ఒక వినియోగదారు-కేంద్రీకృత బ్రాండ్ గా, డ్రూమ్, అతి చవకైన ధరలతో, తమ అతిపెద్ద విక్రయాల ద్వారా, తన యూజర్-బేస్ ను మరింత ప్రోత్సహించడానికి, అసమాన్యమైన కొనుగోలు అనుభవాన్ని అందించడానికి, వారి టాప్ నాచ్ విక్రయానంతర సేవలలో ఎలాంటి రాజీ పడకుండా, వారికి అందించడానికి సిద్ధంగా ఉంది. అన్ని విభాగాలలో ఆకర్షణీయమైన ఆఫర్స్ తో, డ్రూమ్ వారి పండుగ మేళ, ప్రతిఒక్కరికీ ఏదో ఒక లాభాన్ని చేకూర్చే వాగ్దానం చేస్తోంది. 2018లో ఈ మేళా, రూ.25 కోట్ల బడ్జెట్ తో 4 వారాలపాటు నిర్వహించబడితే, ఈ సంవత్సరం, ఇంకా పెద్దఎత్తులో దీనిని జరపాలని కంపెనీ నిర్ణయించింది. అంటే రూ.50 కోట్ల బడ్జెట్ తో 8 వారాల పాటు జరుపాలని నిశ్చయించింది. అదనంగా, గత సంవత్సర ఆఫర్స్ అయిన, యూజ్డ్ కొత్త వాహనాలు, రహదారి పక్కన సహాయం, హెల్మెట్స్, కార్ సిప్పర్స్, కార్ పర్ఫ్యూమ్ తో పాటుగా ఈ సంవత్సరం టు-వెలర్స్, ఫోర్-వీలర్స్, లోన్స్, బీమా, సర్టిఫికేషన్, కార్ కేర్, అనేవి కూడా చేర్చబడ్డాయి.
ఈ దీపావళి మేళాలో ఈ విభాగాలలో కొన్ని అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్స్ లో కొన్ని ఇలా ఉన్నాయి:
ప్రతిరోజు ఒక బైక్/స్కూటర్ @ రూ 999
ప్రతివారం ఒక కార్ @ రూ 9,999
ప్రతి నెలా ఒక లగ్జరీ కార్ @ రూ 99,999,
బీమా – ప్రీమియం యొక్క 15% వరకు క్యాష్ బ్యాక్, 75% వరకు డిస్కౌంట్
ఆర్‌ఎస్‌ఎ - రూ.25 ల నుండి ప్రారంభం
విడిభాగాలు - రూ.9 నుండి ప్రారంభం – హెల్మెట్స్, కార్ పర్ఫ్యూమ్స్
Moreover, customers who opt for EMI will get to avail the exclusive offer of ‘No EMI for the first 3 months’. Further, a processing fee will be paid back in Droom Miles to customers who take a loan or insurance, i.e. the Droom Miles will be credited to their account during the buying season.
భారతదేశంలోని అతి పెద్ద ఆన్ లైన్ ఆటోమొబైల్ విక్రయాలలో ఒకటైన దీనిపై, ప్రభావం మరియు పరిధి గురించి మాట్లాడుతూ, పునీత్ భాస్కర్, ప్రెసిడెంట్ మరియు హెడ్, మార్కెట్ ప్లేస్, డ్రూమ్ ఇలా అన్నారు, "పండుగ సీజన్ రాబోతోంది కాబట్టి, డ్రూమ్ లో మేము, ఈ వేడుక సమయంలో మా వినియోగదారులందరూ తమ జేబులకు చిల్లులుపడతాయేమో అనే ఆందోళన లేకుండా, ఆనందించాలని కోరుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ సమయంలో మేము సాధారణంగా అందించే ఉత్తేజకర ఆఫర్ల వలన మా వ్యాపార పనితీరు ఇనుమడిస్తోందని గమనించాము, ఇది 2016 లో 4వ త్రైమాసంలో జిఎంవి విక్రయాలు 410 కోట్లు, 2017 లో 883 కోట్లు, మరియు 2018 లో 1741 కోట్లగా ఉంది. మేము ఇతర సమయాలలో పోల్చినప్పుడు పండుగ సీజన్ లో 25-30% అభివృద్ధిని గమనించాము. అందుచేత, ఈ సంవత్సరానికి ఒక అతిపెద్ద బడ్జెట్ కేటాయింపులో మేము ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తూ, సరిగాలేని మార్కెట్ పరిస్థితులలో కూడా సుమారు 40-60% అభివృద్ధి కలుగుతుందని దృఢనిశ్చయంతో ఉన్నాము.”
ఇలాంటి అద్భుతమైన డీల్స్ మరియు ఆఫర్స్ అందించడం ద్వారా, డ్రూమ్, భారతదేశమంతటా అత్యంత ప్రముఖ ఆన్ లైన్ ఆటోమొబైల్ మార్కెట్ ప్లేస్ గా తన స్థానాన్ని విజయవంతంగా బలోపేతం చేసుకుంది. మరింత తెలుసుకోవడానికి మరియు ఫెస్టివల్ మేళ 2019 యొక్క అద్భుతమైన డీల్స్ పొందడానికి, దయచేసి సందర్శించండి: https://droom.in.
డ్రూమ్ గురించి:
డ్రూమ్ అనేది ఒక AI మరియు డేటా సైన్సెస్ నడపబడిన ఆన్ లైన్ లావాదేవీల వేదిక, ఇది భారతదేశంలో మరియు ఇతర ఉద్భ్విస్తున్న మార్కెట్స్ లో యూజ్డ్ మరియు కొత్త ఆటోమొబైల్స్ యొక్క కొనుగోలు మరియు విక్రయం లో 21వ శతాబ్దపు అనుభవాన్ని అందిస్తుంది. డ్రూమ్ లో ఇన్-బిల్ట్ టెక్ మరియు డేటా సైన్స్ సాధనాలు ఉండి, వినియోగించబడిన ఆటోమొబైల్స్, అంటే ఓబివి (ప్రైసింగ్ ఇంజిన్), ఎకో (1,000+ పాయింట్స్ వాహన తనిఖీ), హిస్టరీ (ఉపయోగించబడిన వాహనాలకు చరిత్ర రికార్డులు), డిస్కవరీ (డజన్ల కొద్దీ ముందస్తు-కొనుగోలు సాధనాలు ) మరియు క్రెడిట్ (వినియోగించబడిన వాహనాల ఋణాల కోసం, భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మార్కెట్ ప్లేస్) లతో సహా ఒక సంపూర్ణ పర్యావరణ-సిస్టమ్ ను కలిగి ఉంది. డ్రూమ్, వ్యక్తిగత కొనుగోలుదారులు మరియు విక్రయదారులు, డీలర్లు మరియు అతి పెద్ద వాణిజ్యసంస్థలకు, కొనుగోలు చేయడం మరియు విక్రయించడంలో సహాయం చేయడమే కాకుండా, సంపూర్ణ జీవన చక్రాన్ని మరియు ఆటోమొబైల్ అనుబంధ సర్వీసులన్నింటినీ కూడా నిర్వహిస్తుంది.
డ్రూమ్ కు నాలుగు మార్కెట్ ప్లేస్ ఫార్మాట్స్ ఉన్నాయి అవి, B2C, C2C, C2B మరియు B2B, మరియు మూడు ధరల ఫార్మాట్స్ ఉన్నాయి – ఫిక్స్డ్ ధర, ఉత్తమ ఆఫర్ మరియు వేలం. ఈ వేదిక బైసైకిల్ నుండి విమానం వరకు మరియు అన్ని ఆటోమొబైల్ సర్వీసులైన వారంటీ, ఆర్ఎస్ఎ, బీమా మరియు ఆటోలోన్ వంటివాటి విస్తృత శ్రేణిని అందిస్తుంది.
డ్రూమ్ అనేది, ఆన్ లైన్ ఆటోమోబైల్ లావాదేవీలలో 80% వాటా కలిగి ఉండి, జిఎంవి అంశాలలో భారతదేశంలోనే 4వ అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీ. భారతదేశంలోనే కాకుండా, డ్రూమ్, సింగపూర్, థాయిలాండ్ మరియు మలేషియాలలోకూడా తన ఉనికిని కలిగి ఉంది. ఓబివి అనేది ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలలో అందుబాటులో ఉంటూ, ఓబివిని ప్రపంచంలోనే నంబర్ వన్ బెంచ్‌మార్క్ ప్రైసింగ్ ఇంజిన్ గా చేస్తుంది.
ఈ కంపెనీ ప్రస్తుతం, వార్షిక జిఎంవి లో $1.3 బిలియన్ ఏర్పరుస్తోంది మరియు 100% సం/సం రేటుతో అభివృద్ధి చెందుతోంది. డ్రూమ్, భారతదేశంలో 920+ నగరాలలో తన ఉనికిని చాటుతోంది (భారతదేశపు అతిపెద్ద హైపర్-లోకల్ మార్కెట్ ప్లేస్), 300వేల+ ఆటో డీలర్స్ (ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో డీలర్ వేదిక) కలిగి ఉంది, 55+ మిలియన్ల నెలసరి సందర్శకులు, దాదాపుగా 12+ మిలియన్ యాప్ డౌన్లోడ్స్ మరియు 6.5 + మిలియన్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ ను కలిగి ఉంది.
డ్రూమ్ 520+ సిబ్బందితో, భారతదేశంలోని గురుగ్రాం లో తమ ప్రధాన కార్యాలయం కలదు, డ్రూమ్ కు నాలుగు మార్కెట్ ప్లేస్ ఫార్మాట్స్ ఉన్నాయి. డ్రూమ్ అనేది సింగపూర్ హోల్డింగ్ కంపెనీ, అది భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ లో తన అనుబంధ సంస్థలను కలిగి ఉంది. ఈ కంపెనీ ఇప్పటివరకు ఆరు రౌండ్లలో దాదాపుగా $125 మిలియన్ డాలర్ నిధుల సమీకరణ ద్వారా సేకరించింది. ప్రముఖ పెట్టుబడిదారులలో కొన్ని, *లైట్ బాక్స్, బీనెక్స్ట్, బీనోస్, డిజిటల్ గ్యారేజి, టొయోటా ట్సుషో కార్పొరేషన్, ఇంటెగ్రేటెడ్ అసెస్ట్స్ మేనేజ్మెంట్*