ఈఎస్ఐ నాచారం హాస్పిటల్ నూతన భవనంను ప్రారంభించిన మంత్రి మల్లా రెడ్డి

Related image

హైదరాబాద్: ఈ రోజు ఈఎస్ఐ నాచారం హాస్పిటల్ నూతన భవనంలో 3rd -4th ఫ్లోర్ లను కార్మికులకు మెరుగైన సౌకర్యాలను అందించటానికి అందుబాటులోకి తెచ్చారు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి, ఉప్పల్ నియోజక వర్గ శాసన సభ్యుడు బేతి సుభాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. సత్యనారాయణ, కార్పొరేటర్లు, ఈఎస్ఐ డాక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని 70 లక్షల మంది ఈఎస్ఐ కార్డు లబ్ది దారులకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే నూతన భవనంలో అన్నీ వసతులు ఏర్పాటు చేయటం జరిగినదని అన్నారు. నూతన భవనంలో కార్పొరేట్ తరహా వైద్య సేవలందించడమే కాకుండా ఇతర వార్డులను కూడా మార్చుతున్నామని తెలిపారు. కార్మికులకు మందుల కొరత రాకుండా మెరుగైన వైద్యం అందించటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎంత బడ్జెట్ అయిన కేటాయించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మెడికల్, సర్జికల్, గైనకాలజీ వార్డులను సందర్శించి పేషెంట్ లకు పండ్లు అందజేశారు. ఈఎస్ఐ నాచారం ఆసుపత్రి సిబ్బంది సేవలను అభినందించారు. వైద్యులు, నర్సులు, ఈఎస్ఐ ఉద్యోగులకు కరోనా కాలంలో సేవలు అందించినందుకు అభినందించారు. 

Ch Malla Reddy
Telangana

More Press Releases