ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని కేసీఆర్ నిర్ణయం.. నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంఓయూ

Related image

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంఓయూ కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది.

దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ  వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈమేరకు, ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవో కు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

KCR
Telangana

More Press Releases