కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తోంది: మంత్రి సింగిరెడ్డి
- ప్రపంచంలోని ప్రముఖ 20 నగరాలలో హైదరాబాద్ ఒకటి
- 2017 అక్టోబరులో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ పాలసీ పెట్టుబడిదారులను ఆకర్షించింది
- అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలను, ఉత్పత్తి యూనిట్లను ప్రారంభించాయి
- టీ హబ్ , వీ హబ్ లు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను పెంచాయి
- 12,635 ఎకరాలలో నిమ్జ్ (national investment & manufacturing zone) తొలి దశను 2020 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది
- గత నాలుగేళ్లలో దేశంలో ఫార్మాస్యూటికల్ హబ్ తో రూ.10 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగారు
- తెలంగాణ ప్రభుత్వం 19 వేల ఎకరాలలో ఫార్మాసిటీ ఏర్పాటుచేసి రూ.64 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంల లక్ష్యంగా పెట్టుకుంది
- వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకాలు రైతాంగానికి బాసటగా నిలిచాయి.
- ప్రపంచంలోనే అతిపెద్దదయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించే కల సాకారమయింది
- తెలంగాణ భారీ వ్యవసాయ ఉత్పత్తులతో దేశ వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలను పెద్దఎత్తున పెంచుతుంది
- దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశ, ప్రపంచ ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించబోతుంది
- ప్రపంచంలోని తెలుగువారందరూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలుకుతున్నాం
- ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తుంది
- గచ్చిబౌళిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగిన దక్కన్ డైలాగ్ 2019 సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- హాజరయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విదేశాంగ సహాయమంత్రి మురళీధరన్, ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు.
.