సీనియర్ కాంగ్రెస్ నేత ముత్యంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Related image

మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతి పట్ల సీఎం కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతో పాటు కలిసి పనిచేసిన గతాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన ముత్యం రెడ్డి ఒక సందర్భంలో తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా ఒక ఆదర్శవంతమైన నేతను కోల్పోయిందని, వారి మరణం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

KCR
Medak District
Telangana

More Press Releases