గటిక విజయ్ కుమార్ ను అభినందించిన సీఎం కేసీఆర్

Related image

ఉజ్వల ప్రస్థానం, బంగారుబాట పుస్తకాల రచయిత గటిక విజయ్ కుమార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ పుస్తకాల ప్రతులను విజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు ప్రగతిభవన్ లో అందించారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్రమ పద్ధతిని, తెలంగాణ ఉద్యమ ఘట్టాలను, తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఉజ్వల ప్రస్థానంలో చక్కగా వివరించారని సీఎం అన్నారు. ‘‘పుస్తకావిష్కరణ చాలా బాగా జరిగింది. పుస్తకాలు బాగా వచ్చాయి. అభినందనలు’’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

KCR
Hyderabad
Telangana
Gatika Vijay kumar

More Press Releases