ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలి: ఐసీఎంఆర్ సలహాదారు బిపి ఆచార్య విజ్ఞప్తి

Related image

హైదరాబాద్: ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిసెర్చ్(ICMR) సలహాదారు బిపి ఆచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గురువారంనాడు బయోలాజికల్ ఇ, శామీర్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మేడ్చల్ పరిధిలోని జీనోమ్ వ్యాలీలో టీకా ఉత్సవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా బయోలాజికల్ ఇ, ఇతర సంస్థలకు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులకు కోవాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు.

ఈ సందర్భంగా బి.పి ఆచార్య మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారి దేశంలో రెండో దశ ఉధృతంగా కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలని, వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పక పాటించాలని సూచించారు. టీకా ఉత్సవ్ నిర్వహించినందుకు నిర్వాహకులకు ఉద్యోగస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ICMR
Corona Virus
COVID19
Hyderabad
Telangana

More Press Releases