సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Related image

  • అంబేద్కర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళి
హైదరాబాద్, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. అరణ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి, డీ.ఎఫ్.వో లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ....సమ సమాజ స్థాపన కోసం, దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.  

Indrakaran Reddy
Telangana

More Press Releases