తెలంగాణలో ఎయిర్ స్ట్రిప్ ల మంజూరీ కోసం కృషి చేస్తా: సీఎంకు కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి హామీ

Related image

హైదరాబాద్: కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో ఇవాళ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలలో ఎయిర్ స్ట్రిప్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం పౌర విమానయాన కార్యదర్శిని ఈ భేటీ సందర్భంగా కోరారు. కాగా రాష్ట్రంలో ఎయిర్ స్ట్రిప్ ల మంజూరీ కోసం తాను కృషి చేస్తానని ప్రదీప్ సింగ్ ఖరోలా సీఎంకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎన్సీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

KCR
Telangana

More Press Releases