ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడమే రేపటి తరానికి మనం కూడబెట్టే అత్యంత విలువైన సంపద: సీఎం కేసీఆర్

Related image

హైదరాబాద్: ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడమే రేపటి తరానికి మనం కూడబెట్టే అత్యంత విలువైన సంపదన్నారు. తెలంగాణలో అడుగంటి పోయిన జలాలను తిరిగి సమకూర్చే దిశగా సాగునీటి, తాగునీటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్నదని సీఎం తెలిపారు.

మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా  తెలంగాణలో భూ ఉపరితల జలాల లభ్యతను పెంచడం తద్వారా అడుగంటిన భూగర్భ జలాలను భూ పై పొరల్లోకి చేరే విధంగా, జల పునరుజ్జీవన జరుగుతున్నదన్నారు. తెలంగాణ ప్రజలకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన, శుద్ధిచేసిన, సురక్షిత తాగునీటిని గడప గడపకూ అందించడం ద్వారా తెలంగాణ తాగునీటి కష్టాలను పారదోలడమే కాకుండా, ఫ్లోరైడ్ వంటి ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపిందన్నారు.

గడచిన ఆరేండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యల ద్వారా తెలంగాణ జల వనరుల స్వరూపం గుణాత్మకంగా అభివృద్ధి చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహా ప్రపంచ జల వనరుల నిపుణులు తెలంగాణలో జరుగుతున్న జల పునరుజ్జీవన కార్యక్రమాలను కొనియాడుతుండటం మనకు గర్వ కారణమన్నారు.

KCR

More Press Releases