యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
![Related image](https://imgd.ap7am.com/bimg/press-167a9d93f4581201d054e421fd5b00430d2a7db7.jpg)
హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. నేటి (సోమవారం) నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 25 దాకా, పదకొండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈఓ గీతారెడ్డి, అర్చకులు తదితరులున్నారు.