మార్చి 15 నుండి తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు.. సీఎస్ సమీక్షా సమావేశం
హైదరాబాద్: మార్చి 15 నుండి జరగబోయే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి తగు నివేదికలతో, సమాయత్తం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శాసన మండలి, శాసన సభలో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. ఈ సమావేశాలలో ఉత్పన్నమయ్యే Special Mentions, LAQs, LCQs, Assurances సంబంధించిన తగు సమాచారంతో అధికారులు సిద్దంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శాఖల వారీగా సమన్వయ అధికారులను ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలలో శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు జీరో అవర్ లో లేవనెత్తే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ శాఖలకు అందించి, వెంటనే తగు సమయంలో ఆ సమాచారాన్ని వారికి తెలియజేసేందుకు సమన్వయ అధికారులు సిద్దంగా ఉండాలని, అసెంబ్లీ సమావేశాలలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను సమీక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించిన విధంగా ఉద్యోగులకు పదోన్నతులను అతి తక్కువ సమయంలో పూర్తి చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను అభినందించారు. అదే విధంగా భారత స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవ వేడుకలు, కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులు, కారుణ్య నియమాకాలకు సంబంధించి ఉత్పన్నమైన అంశాలను, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, వికాస్ రాజ్, రజత్ కుమార్, సబ్యసాచి ఘోష్, రవిగుప్త, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, S.A.M.రిజ్వీ, శేషాద్రి, రోనాల్డ్ రోస్, రాహుల్ బొజ్జా, క్రిస్టినా చొంగ్తు, నదీమ్ అహ్మద్, జనార్ధన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అనితా రాజేంద్ర, శ్రీనివాస రాజు, సర్పరాజ్ అహ్మద్, సంతోష్ రెడ్డి, లా సెక్రటరీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (EPTRI) పై సమీక్ష:
వాతావరణ మార్పులు, Environment impact assessment, Waste Management తదితర అంశాలపై వివిధ ప్రఖ్యాత విద్యా సంస్థలు, ప్రముఖులను గుర్తించి ప్రాజెక్టులు చేపట్టేలా పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థకు (EPTRI) స్పష్టమైన ప్రణాళిక ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. బి.ఆర్. కె.ఆర్ భవన్ లో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (EPTRI) పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు EPTRI ను ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను కోరారు. పరిశోధనపై ప్రత్యేక శ్రద్ద, మానవ వనరుల పెంపుదలపై చర్చించారు. మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ ను మరింతగా చేపట్టడానికి నెల వారి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సంస్థ మొక్క Brand Value పెంచడానికి ప్రతి సంవత్సరం రెండు వర్కుషాపులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈ.పి.టి.ఆర్.ఐ డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పిసిసిఎఫ్, (ఎస్ ఎఫ్), ఆర్.యం.డోబ్రియల్, పిసిబి కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సీఎస్ ను కలిసిన మెడికల్ కాలేజీల టీచింగ్ ఫ్యాకల్టీ ఆఫీసు బేరర్స్:
మెడికల్ కాలేజీల టీచింగ్ ఫ్యాకల్టీ ఆఫీసు బేరర్స్ బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిశారు. టీచింగ్ ఫ్యాకల్టీకి U.G.C. స్కేళ్ళు వర్తింపజేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి ధన్యవాదములు తెలిపారు. అదే విధంగా నూతన పేస్కేల్స్ ప్రకారం మాట్రిక్స్ పే ఫిక్సేషన్ చేస్తున్నందుకు ప్రభుత్వమునకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేష్ రెడ్డి, TGGDA DH అధ్యక్షుడు డా.లాలు ప్రసాద్ రాథోడ్, TGGDA అధ్యక్షుడు డా. ప్రవీణ్, ఆఫీసు బేరర్స్ తదితరులు పాల్గొన్నారు.