తెలంగాణ సీఎస్ ను కలిసిన ఈస్తోనియా అంబాసిడర్

Related image

హైదరాబాద్: ఈస్తోనియా అంబాసిడర్ Ms.Katrin Kivi మరియు డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్ Ms. Juui Hiio లు శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్నపలు సంస్కరణలను ఈస్తోనియా డెలిగేట్స్ కు వివరించారు. అందులో భాగంగా చేపట్టిన ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్, ఇ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, అభివృద్ది మరియు సంక్షేమ పథకాల గురించి తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఈస్తోనియా డెలిగేట్స్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి S.A.M.రిజ్వీ, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరి అర్విందర్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 SERP, MEPMA లు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై సమీక్ష:

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటి వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ ప్రైస్, డెవలప్ మెంట్, కన్వర్ జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SERP, MEPMA లు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకురావడానికి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, Soil testing, కూరగాయల సాగు, పశుసంవర్ధకం న్యూట్రేషన్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అంశానికి సంబంధించి అధికారులతో small groups ఏర్పాటు చేసి వివరాలతో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఐటి వినియోగం ద్వారా SHG గ్రూపులకు నిరంతర సేవలందించాలని, ప్రతి గ్రూప్ కు బ్యాంక్ లింకేజ్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో చిన్నారులలో మాల్ న్యూట్రీషన్, మహిళలలో అనీమియా తగ్గించడానికి SHG లు, సంబంధిత లైన్ డిపార్టుమెంట్స్ కన్వర్జెన్సీ తో కృషి చేయాలని అధికారులను కోరారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, యస్సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, CDMA సత్యనారాయణ, Lead-IBCD SISD HR, Govt.of India, ఉషారాణి, హార్టీకల్చర్ డైరెక్టర్ ఎల్. వెంకట్రాం రెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి, స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖీల్, WE Hub సిఈఓ దీప్తి రేవుల, శ్రీనిధి యండి జి.విద్యాసాగర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు

More Press Releases