శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న జంతువు అడవి పిల్లిగా నిర్థారణ

Related image

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న జంతువు అడవి పిల్లిగా నిర్థారణ అయింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాల్లో అడవి పిల్లి చిత్రాలు నిన్న రాత్రి స్పష్టంగా రికార్డు అయ్యాయి. గత కొంత కాలంగా శంషాబాద్ పరిసరాల్లో చిరుత పులి సంచారం ఉందనే వార్తలు వచ్చాయి. అయితే అటవీ శాఖ సిబ్బంది పెట్టిన నిఘాలో చిరుతకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, కదలికలు లభ్యం కాలేదు.

విమానాశ్రయం సిబ్బంది, స్థానికులు భయపడుతున్నారనే సమాచారంతో అటవీ శాఖ కెమెరాలు, బోనులను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసింది. మంచి ఆరోగ్యంగా, ధృడంగా ఉన్న అడవి పిల్లి చిత్రాలు కెమెరాకు చిక్కాయని, చిరుత సంచారం లేదని శంషాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి సీహెచ్. శివయ్య తెలిపారు. స్థానికుల భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. 

More Press Releases