శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుత పులి సంచరించిన ఆనవాళ్లు లేవు: తెలంగాణ అటవీ శాఖ

Related image

  • ట్రాప్ కెమెరాలకు చిక్కిన అడవి పిల్లులు, ఊర కుక్కలు, అడవి పందులు
  • అప్రమత్తంగా ఉన్నాం, స్థానికులు భయపడాల్సిన అవసరం లేదు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఇటీవల చిరుత పులి సంచరిస్తుందన్న వార్తల నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. శంషాబాద్ రేంజి ఫారెస్ట్ సిబ్బంది, విమానాశ్రయం భద్రతా అధికారులతో కలసి చుట్టుపక్కల గట్టి సోదా నిర్వహించారు. ఎక్కడ కూడా చిరుత పులి తిరిగిన, ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. కానీ విమానాశ్రయం అధికారులు చిరుత పులి కదలికలు ఉన్నవి, అడవి పందులను చంపుతున్నది అని చెప్పగా, చనిపోయిన అడవి పందులను పరిశీలించగా వాటిని కుక్కలు చంపినట్లుగా ఆధారాలు లభించాయి.

విమానాశ్రయం అధికారులు కోరటంతో ముందు జాగ్రత్తగా 10 ట్రాప్ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. అందులో కూడా చిరుత పులి కదలికలు కనిపించలేదు. కేవలం ఊర కుక్కలు, అడవి పిల్లులు, పందులు కనిపించనవి. ఇంత వరకు ఎక్కడ కూడా చిరుత పులి అడుగులు కనబడలేదు. విమానాశ్రయం ప్రహరీ దూకినట్లుగా గతంలో సీసీ కెమెరాలకు లభించిన ఆధారాలు సివిట్ క్యాట్ వి (మానుపిల్లి) అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్ పోర్టు అధికారుల విజ్ఞప్తి మేరకు మరొక 10 ట్రాప్ కెమెరాలు, ( మొత్తం 20), రెండు బోనులు (Trap Cages) కూడా పెట్టడం జరిగింది. కావునా చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరియు విమానాశ్రయం సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. తమ సిబ్బంది ద్వారా తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని తెలిపింది.

More Press Releases