రైతులు, ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులతో సదస్సు.
ఆటోస్టార్టర్లు తొలగించండి. భూగర్భ జలాలు కాపాడండి అనే నినాదం శనివారం సిద్ధిపేటలో మార్మోగింది. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన రైతుల అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. ఆటోమేటిక్ స్టార్టర్ ల తొలగింపుపై మంత్రి రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
సిద్దిపేట మండలం బంజెరూపల్లి గ్రామంలో రైతులు ,ప్రజలు తమ భావుల వద్ద ఉన్న మోటార్ ల ఆటోమేటిక్ స్టార్టర్ లు తీసేసి అవగహన సదస్సుకు స్టార్టర్ లతో సహా హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు వారిని అభినందించారు. బంజారుపల్లి ఆటో స్టాటర్ తొలగించి రాష్టానికె ఆదర్శంగా నిలిచిందన్నారు.
దేశంలో రైతుకు 24 గంటలు ఉచిత కరెంటు సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని హరీష్ రావు తెలిపారు. గ్రామాలకు,పరిశ్రమలకు,రైతులకు అందరి అవసరాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత ముఖ్య మంత్రి కెసిఆర్ దే నన్నారు.గతంలో కాంగ్రెస్ హయాంలో 6 గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో కావాల్సినంత కరెంట్ ఇస్తున్నందున ఆటోమేటిక్ స్టార్టర్ల అవసరం లేదన్నారు. రాష్ట్రం రాక ముందు కరెంటు లోఓల్టేజ్ తో మోటార్లు కాలి పోయేవని హరీశ్ రావు చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్న దని చెప్పారు.అవసరమైన సబ్ స్టేషన్లు ,ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మోటార్లు,ట్రాన్స్ఫార్మర్స్ కాలి పోయే సంఘటనలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 6 గంటలు కరెంటు సరిగ్గా రావటం లేదని సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో ధర్నా, రాజీవ్ రహదారి దిగ్బంధం, సబ్ స్టేషన్ లపై దాడి చేసిన సంఘటనలను మంత్రి గుర్తు చేశారు. కరెంటు కోసం ఆందోళనలు,ధర్నాలు లేవన్నారు. అయితే ఉచిత కరెంటు అనే ఉద్దేశ్యంతో అవసరానికి మించి నీరు తొడితే భూగర్భ జలాలు ఇంకి పోయి పంటలు ఎండిపోతాయని హరీశ్ రావు రైతులకు చెప్పారు.