3 డయాగ్నొస్టిక్ మినీ హబ్ లను ప్రారంభించిన తెలంగాణ హోంమంత్రి

Related image

హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో డయాగ్నొస్టిక్ మినీ హబ్ లను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పురానాపూల్, పానీ పుర, బర్కాస్ లలో మినీ హబ్ లను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికే బస్తీ దవాఖానలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈసీజీ, యుఎస్జి, ఎక్సరే, ఇతర రేడియాలజీ సర్వీసులను ఈ మినీ హబ్ ల ద్వారా పేదలకు అందిస్తామని హోంమంత్రి తెలియజేశారు. బస్తీ దవాఖానలలో సూచించిన పరీక్షలను మినీ హబ్ లలో చేయడం ద్వారా పేద ప్రజలు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా మెడికల్ రిపోర్ట్ లను పొందవచ్చని పేర్కొన్నారు.

అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, ఆసుపత్రులలో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డాక్టర్ ఉమా, డాక్టర్ నందిత తదితర వైద్య అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Md Mahamood Ali
Hyderabad
Telangana

More Press Releases