వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించిన నిధుల వివరాలు
కేంద్ర ప్రభుత్వం జూన్ 2015 లో స్మార్ట్ సిటీ మిషన్ ను ప్రారంభించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను మే 2016లో స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడం జరిగిందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.
వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించిన నిధుల వివరాలు:
- కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.196.40 కోట్లు
- వరంగల్ కు బదిలీ చేసిన నిధులు రూ.196.40 కోట్లు
మే 2021 వరకు స్మార్ట్ సిటీ పనుల నిర్వహణ కోసం వరంగల్ కార్పొరేషన్ లో సరిపడా నిధులు ఉన్నాయని ఆయన అన్నారు. వరంగల్ కార్పొరేషన్ లో పనుల పురోగతి మేరకు అవసరమున్న దానికంటె ఎక్కువ నిధులు ఉన్నాయని, నిధులు ఉన్నప్పటికి పనులు చేపట్టడంలో ప్రాధమికంగా జాప్యాలు భూసేకరణ, సవివరణ ప్రాజెక్ట్ నివేదిక (DPR)ల తయారీ లాంటి పనులు అన్ని మేజర్ ప్రాజెక్టులలో వలెనే జాప్యం జరిగిందని, అయినప్పటికి రాష్ట్రప్రభుత్వం నిరంతర పర్యవేక్షణలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం స్వంత బడ్జెట్ నుండి సుమారు రూ.182 కోట్లు కేటాయించిందని, ఇందులో ముఖ్యమంత్రి హామి నిధుల క్రింద రూ.109.29 కోట్లు, పట్టణ ప్రగతి క్రింద 72.87 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన పనులు పూర్తి అయి బిల్లులు సమర్పించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన తమ వాటా మ్యాచింగ్ గ్రాంట్ ను ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి తెలియజేశారు.