జాతీయ స్ధాయిలో ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ లు రోల్ మోడల్ గా నిలవాలి: తెలంగాణ సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ యువతలో Entrepreneurship (ఎంటర్ ప్రెన్యూర్ షిప్) పెంపొందించటానికి అవసరమైన సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
సోమవారం బిఆర్ కెఆర్ భవన్ లో డిక్కి బృందం (Dalit Indian Chamber of Commerce & Industry) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వీకర్ సెక్షన్ కు సంబంధించిన వారు పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించటానికి వారు వివిధ రంగాలలో రానించటానికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. డిక్కీ ద్వారా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పెంపొందించటం కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.
వివిధ పరిశ్రమలలో డిక్కి ఇన్నోవేటివ్ ఐడియాలు అమలు చేస్తున్నందుకు సీఎస్ అభినందిస్తూ జాతీయ స్ధాయిలో ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ లు రోల్ మోడల్ గా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం CM’s STఎంటర్ ప్రెన్యూర్ ఇన్నోవేషన్ ద్వారా విజయవంతంగా శిక్షణను అందిస్తుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.టి రామారావు పరిశ్రమల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు కృషి చేయాలని సీఎస్ వారిని కోరారు.
Dalit Indian Chamber of Commerce & Industry ప్రతినిధులు అరుణ దాసరి, పద్మశ్రీ రవి కుమార్ నర్రా, రాహుల్ కిరణ్, సురేష్ నాయక్, మున్నయ్య తమనం, మునీంధర్, రమేశ్ నాయక్, వెంకటేశ్వర్ రావు, పరమేశ్ లు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సెక్రటెరియట్, HODs మరియు జిల్లా స్ధాయిలలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులను , HOD ల ఉన్నతాధికారులను ఆదేశించారు.
సోమవారం బిఆర్ కెఆర్ భవన్ లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు మరియు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రమోషన్ల తో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వలన వచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియమాల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పోస్టుల భర్తీ అంశాలపై ప్రతి వారంలో బుధవారం (జనవరి 6, 20, 27 తేదీలు) సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ ప్రకారం అన్ని శాఖల కార్యదర్శులు , HOD లు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని హామి ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారులు అనురాగ్ శర్మ, కె.వి.రమణా చారి, ఎ.కె.ఖాన్, ఎస్.కె.జోషిలతో పాటు డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ అధికారులు పూర్ణ చందర్ రావు, గోపి కృష్ణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సురేష్ చందా, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు రజత్ కుమార్, అర్వింద్ కుమార్, రామక్రిష్ణారావు, సునీల్ శర్మ, జయేష్ రంజన్, రవిగుప్తా, హర్ ప్రీత్ సింగ్, కార్యదర్శులు మరియు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.