హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ 12వ సమావేశం
హైదరాబాద్ నగరంలో HRDCL ద్వారా మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం ద్వారా మంచి కనెక్టివిటి ఏర్పడినందుకు సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు.
సోమవారం బిఆర్ కెఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ 12వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మూసీ నది వెంట ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బ్రిడ్జీల నిర్మాణం కోసం స్ధలాలను ఎంపిక చేయాలని బ్రిడ్జీల నిర్మాణం ద్వారా ఆయా ప్రాంతాలలో మరింత అభివృద్ధికి అవకాశం కలుగుతుందని అన్నారు.
HRDCL ద్వారా చేపడుతున్న మిస్సింగ్ లింక్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ, మరిన్ని పనులను ప్రణాళికాయుతంగా చేపట్టాలని ఆదేశించారు. మొదటి దశ కింద రూ.313.65 కోట్లతో 37 మిస్సింగ్ లింక్ పనులను చేపట్టగా, 23 పనులు పురోగతిలోను, పూర్తి అయ్యేదశలో ఉన్నాయని, మిగతా పనులను రెండవ దశలో ప్రతిపాదించడం జరిగిందన్నారు. వివిధ రహదారుల అభివృద్ధి ప్రణాళికలు తయారీలో ఉన్నాయని, వచ్చే 2 సంవత్సరాలలో వీటిని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. బ్రిడ్జిలు, ROB/RUB, మిస్సింగ్ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని బోర్డు సమీక్షించింది.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ,ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, కమీషనర్ ఆఫ్ పోలీస్, హైదరబాద్ అంజనీకుమార్, ట్రాఫిక్ అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్, CMD,TSSPDCL జి.రఘుమారెడ్డి, ENC,R&B పి.రవీందర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.