తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థకు ఉత్తమ విత్తన సంస్థ ధృవీకరణ అవార్డు

Related image

  • ఇండియా సీడ్ అవార్డ్స్ లో అవార్డు అందుకున్న విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు
  • జూమ్ ఆన్ లైన్ వేదికపై ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, నరేంద్ర సింగ్ తోమర్, జాతీయ వర్షాధార పంటల అథారిటీ (NRAA), CEO, అశోక్ ధాల్వాయ్, IAS మరియు ఇతర భారత ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఆవార్డులు ప్రధానం చేసిన అగ్రికల్చర్ టుడే గ్రూప్
  • భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR), పంట రకాల, రైతు హక్కుల పరిరక్షణ చట్టం (PPVFRA), భారత విత్తన పరిశ్రమ ప్రముఖుల ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ అవార్డుల ప్రధానం చేసిన అగ్రికల్చర్ టుడే గ్రూప్
  • విత్తన రంగ అభివృద్దే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రం ఏర్పడిన తరువాత విత్తన ధృవీకరణలో నూతన సంస్కరణలతో దేశంలో నంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ
  • అంతర్జాతీయ స్థాయిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ సౌకర్యాలను, మౌలిక సదుపాయాలను  కలిగిఉండి విత్తన ధృవీకరణలో దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచిన  తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ
  • దేశంలో తొలి సారిగా ఆన్ లైన్ విత్తన ధృవీకరణను, అంతర్జాతీయ విత్తన ధృవీకరణను ప్రవేశపెట్టి దేశంలోని 10 రాష్ట్రాలకే కాకుండా వివిధ దేశాలకు విత్తన ఎగుమతులు చేసి విత్తన ధృవీకరణలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది
  • అంతర్జాతీయ స్థాయి సంస్థలైన ISTA, OECD, ISF, UPOV, FAO సంబంధాలు మెరుగుపరచుకొని విత్తన రైతులకు, విత్తనోత్పత్తి దారులకు వర్క్ షాప్ లు, శిక్షణ కార్యక్రమాలు, సెమినార్ లు నిర్వహిస్తూ రాష్ట్ర విత్తన రంగమే కాకుండా దేశ విత్తన రంగ అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ తోడ్పాటు అందించింది
  • 1970 వ సంవత్సరం నుండి 1980 వ సంవత్సర మద్య కాలంలో భారత ప్రభుత్వం విత్తన చట్టం 1966 అనుసరించి దేశంలో దాదాపు 25 రాష్ట్రాలలో విత్తన ధృవీకరణ సంస్థలను నెలకొల్పడం జరిగింది.
  • అప్పటినుండి 25 రాష్ట్రాలలో విత్తన ధృవీకరణ సంస్థలు రైతులకు నాణ్యమైన ధృవీకరణ విత్తనములు క్రమపద్ధతిలో నిర్దేశింపబడిన ప్రమాణాలకు అనుగుణంగా విత్తన ధృవీకరణ చేపట్టడం జరుగుచున్నది.
  • అన్ని రాష్ట్రాలలో కెల్లా తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ
  • ఉత్తమ విత్తన ధృవీకరణ సంస్థగా ఆవార్డుకు ఎంపికైంది
  • తెలంగాణను “ప్రపంచ విత్తన భాండాగారం ”దిశగా ప్రోత్సహించడానికి కావలసిన అన్ని రకాల చర్యలు చేపడుతూ ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి గొప్ప అవార్డు రావడం పై సంతోషం వ్యక్తం చేస్తూ విత్తన ధృవీకరణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులును అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

More Press Releases