తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదు: చంద్రబాబు
![Related image](https://imgd.ap7am.com/bimg/press-91ed16246d5890189f66ed2059b18a609b7dc47c.jpg)
విజయవాడలో నిన్న తెదేపా రాష్ట్రస్థాయి సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'తెలుగుదేశం ఇప్పటి వరకూ ఎన్నో గెలుపోటములను చూసిందని, సంక్షోభాలు తెలుగుదేశానికి కొత్తేమీ కాదని అన్నారు. 37ఏళ్లుగా ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ మనదని, మళ్లీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చే వరకూ విశ్రమించేది లేదని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.