సమిష్టి కృషితో తుంగభద్ర పుష్కరాలు విజయవంతం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో లక్షలాది మంది భక్తులు వచ్చిన ఎంతో సహనంతో అధికారులు విధులు నిర్వహించారన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో గోదావరి, కృష్ణ పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, తుంగభద్ర పుష్కరాలను కూడా విజయవంతంగా నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. తుంగభద్ర పుష్కరాలకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు, పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేలా తమ సహాకారం అందించిన సహాచర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గద్వాల్ ఎమ్మెల్యే అబ్రహంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, ఎస్పీ రంజాన్ రతన్ కుమార్, జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖతో పాటు వివిధ శాఖ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి, పని చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం అయ్యాయని వారి సేవలను కొనియాడారు. కోవిడ్ లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో అధికార యంత్రాంగానికి సహాకరించిన భక్తులకు మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.