బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు దరఖాస్తుకు నేడు ఆఖరు తేదీ

Related image

బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల దరఖాస్తుకు బుధవారంతో గడువు ముగుస్తోందని అటవీ శాఖ సోమవారం తెలిపింది. ఆలస్య రుసుము రూ.వెయ్యి చెల్లించి ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇంటర్మీడియట్, ఎంసెట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొంది. పూర్తి వివరాలకు www.fcrits.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.

పేమెంట్ కోటా సీట్లు (Payment Quota Seats):

ఈ సంవత్సరం (2020-21) నుండి పేమెంట్ కోటా సీట్లను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికై దరఖాస్తును నేటి నుండి (18th Nov) తీసుకొనబడును. దరఖాస్తుకై చివరి తేదీ 25 నవంబరుగా నిర్ణయించడం జరిగింది. దరఖాస్తు రుసుం రూ.3000 లను చెల్లించి www.fcrits.in. లో అభ్యర్ధులు అప్లై చేయవలసి ఉంటుంది. దరఖాస్తు చేయుటకు ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్ లో ర్యాంక్ కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు www.fcrits.in. లేదా helpline number, 08454-236 510 ను సంప్రదించండి.

BSc Forestry
Admissions
Hyderabad

More Press Releases