ముంపును అరికట్టేలా నాలాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు: మంత్రి కేటీఆర్

Related image

హైదరాబాద్ నగరంలో భారీ వరదలు వచ్చినా ముంపును అరికట్టేలా నాలాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాలాల అభివృద్ధి కోసం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని చేపట్టనుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న నాలాల పైన అధ్యయనం చేసి ఎక్కడైతే అత్యంత సంక్లిష్టంగా పరిస్థితి ఉన్నదో, అక్కడ నాలాలను వెంటనే విస్తృత పరిచేందుకు, వాటిపై ఉన్న కబ్జాలను తొలగించి వరద సాఫీగా కిందికి వెళ్లేందుకు అవసరమైన చర్యలను ఈ ప్రాజెక్టు ద్వారా చర్యలు తీసుకోబోతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

KTR
Hyderabad
GHMC
floods
Telangana
TRS

More Press Releases