వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు
- వరంగల్ - హన్మకొండ వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు - ఉషా దయాకర్ రావు దంపతులు, వారి బావ భాస్కర్ రావు తదితరులు
- మంత్రి ఎర్రబెల్లి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఈఓ
- రుద్రేశ్వరుడి అభిషేకం చేసి, దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఎర్రబెల్లి దంపతులు
- అనంతరం ఆలయంలో దేవిన్నవ రాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద పూజలు చేసిన మంత్రి దంపతులు
- ఆలయ అభివృద్ధి, స్థితిగతులు తదితర అంశాలపై ఇఓ, అర్చకులతో చర్చించిన మంత్రి
- దర్శనానంతరం మంత్రికి ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి పట్టు వస్త్రాలు బహూకరించిన వేయిస్తంభాల గుడి అర్చకులు
- రుద్రేశ్వరుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది
- సిఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను
- కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని ఆకాంక్షించాను.
- అతి పురాతన, కాకతీయుల నాటి, ఎంతో పాటి ఉన్న ఆలయం వేయిస్తంభాల గుడి
- భద్రకాళి దేవాలయానికి, వేయి స్తంభాల రుద్రేశ్వరాలయానికి ఎంతో అనుబంధం ఉంది
- ఈ రెండు దేవాలయాలూ కాకతీయుల కాలంలో నిర్మితమైనవే
- ఆనాడు కాకతీయ రాజులు ఈ గుడికి, భద్రకాళి దేవాలయానికి ప్రతి రోజూ వచ్చి పూజలు చేసే వారని ప్రతీతి
- వేయి స్తంభాల గుడికి పూర్వ వైభవం తేవడానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారు.
- కేంద్ర పరిధిలో ఉన్న ఆర్కియాలజీ విభాగం నిర్లక్ష్యం, అలక్ష్యం వల్ల దేవాలయ అభివృద్ధి కుంటుపడుతున్నది
- అవసరమైతే, కేంద్రంతో చర్చించి వేయి స్తంభాల గుడిని అభివృద్ధి పరచడానికి కృషి చేస్తాం
- వేయి స్తంభాల గుడి పునః ప్రతిష్ట కార్యక్రమం తొందరగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఈవోని ఆదేశించిన మంత్రి
- దేవిన్నవరాత్రులు, బతుకమ్మ, దసరా పండుగలకు పెట్టింది పేరు వరంగల్
- వరంగల్ నుంచే బతుకమ్మ, దేవిన్నవరాత్రులు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి
- బతుకమ్మ పండుగ సహా, తెలంగాణ పండుగలు, పబ్బాలు అన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి
- బతుకమ్మ సంస్కృతిని జాగృతి సంస్థ ద్వారా కల్వకుంట్ల కవిత గారు విశ్వ వ్యాప్తం చేశారు.
- మహిళల్లో ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక సమైక్యతను తీసుకువచ్చారు
- తెలంగాణ వచ్చిన తర్వాత పండుగల పరిస్థితిలో మార్పు వచ్చింది.
- బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం
- మహిళలకు బతకుమ్మ చీరలను, తమ సొంతింటి ఆడపడచులకు సారెలాగా కెసిఆర్ ఇస్తున్నారు
- తెలంగాణలో చారిత్రక, సాంస్కృతిక, భక్తి, అభివృద్ధి, సంక్షేమ వైభవం నడుస్తున్నది
- అందుకే సీఎం కెసిఆర్ ప్రభుత్వం, ప్రపంచం, ప్రజలు అంతా బాగుండాలని కోరుకుంటున్నాను
- వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి మరింత కృషి జరుగుతున్నది
- మొత్తం వరంగల్ నగరాన్ని హైదరబాద్ తరహాలో, అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
- కుడా పరిధిలోనూ అద్భుత అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది
- ప్రజల్లో కాకతీయుల కాలం నాటి నుండీ ఆ ప్రాశస్త్యం కొనసాగుతున్నది
- ప్రజల నమ్మకాలు, ఆలోచనలు, అవసరాలకనుగుణంగా తెలంగాణలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో పరిపాలన సాగుతున్నది