అబ్దుల్ కలాం అవార్డులను అందజేసిన హోం శాఖ మంత్రి

Related image

హైదరాబాద్: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా ఎక్స్ లెన్స్ అవార్డులను తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గురువారం నాడు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అందజేశారు.హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ అబ్దుల్ కలాం పేరిట అవార్డులను అందజేయడం ఆహ్వానించదగ్గ విషయం అని పేర్కొన్నారు.

భారతరత్న అబ్దుల్ కలాం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని తన జీవితాన్ని దేశ సేవ కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. సాధారణ జీవితం గడుపుతూ భారతరత్న అవార్డు అందుకున్న డాక్టర్ అబ్దుల్ కలాం తన రచనల ద్వారా ఎంతోమందికి ప్రేరణ కలిగించాడని ఆయన జయంతి సందర్భంగా అవార్డులు అందజేయాలని మెగా సిటీ నవ కళావేదిక పూనుకోవడం సమంజసమని తెలియజేశారు. జె.రాజేష్ నేత, డాక్టర్ ఆశిష్ చౌహాన్, కె శ్రీనివాస చారి, నవ కళావేదిక అధ్యక్షుడు ఏ.మల్లికార్జున్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Md Mahamood Ali
Hyderabad

More Press Releases