బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
- ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి
- మహిళలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
- ఈ రోజు బతుకమ్మ చీరలను అందుకుంటున్న తెలంగాణ, నా నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు.
- అందరికీ ముందుగానే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, శుభాభివందనాలు.
- తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వమే ప్రజల పండుగలని నిర్వహిస్తున్నది.
- పరిపాలనను, వ్యవసాయం వంటి అన్ని రంగాలను అభివృద్ధి-సంక్షేమ పథకాలతో తెలంగాణనే సిఎం కెసిఆర్ పండుగ చేసిండ్రు.
- రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, బతుకమ్మ పండుగ కానీ, ప్రభుత్వమే ప్రజలకు బట్టలు పెట్టి పండుగని చేయడం చరిత్రలో ఎక్కడా లేదు.
- సిఎం కెసిఆర్ గారు 2017లో బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించినారు.
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేస్తున్నాం.
- తెలంగాణలోని ఆడపడచులకు సారెగా, చీరను బహుమతిగా సిఎం కెసిఆర్ ఇస్తున్నరు.
- ప్రతి ఏడాది రాష్ట్రంలో 1 కోటి 2 లక్షల మంది మహిళలకు చీరలు అందిస్తున్నం.
- రాష్ట్రంలో 20లక్షల, 36వేల, 234 కుటుంబాలకు ఈ చీరలు అందుతున్నయి.
- గత ఏడాది 313 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది 317 కోట్లు ఖర్చు చేస్తున్నం.
- గత ఏడాది 110 రకాల రంగురంగుల చీరలు అందిస్తే, ఈసారి 287 రకాల చీరలు ఇస్తున్నం.
- బంగారు, వెండి, జరీ అంచులతో, మంచి డిజైన్ల కొంగులతో మంచి మంచి బతుకమ్మ చీరలు ఉన్నయి.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13లక్షల, 23వేల చీరలను పంపిణీ చేస్తున్నం.
- పాలకుర్తి నియోజకవర్గంలో 1 లక్షా 4వేల, 745 చీరలను అందిస్తున్నం.
- పలువురు మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రాయపర్తి మహిళలు పాల్గొన్నారు.
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 2 లక్షల మంది మహిళలకు పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి పర్వతగిరి నుంచి రాయపర్తికి బయలుదేరారు. మధ్యలో రాగన్నగూడెం వద్ద ఆగారు. గ్రామ పంచాయతీని సందర్శించారు. కొత్త రెవిన్యూ చట్టంలో భాగంగా ప్రజల ఆస్తులను నమోదు చేస్తున్న వాళ్ళతో మాట్లాడారు. నమోదు ఎలా జరుగుతుందని? జరగుతున్న తీరుని, నమోదు చేస్తున్న అంశాలను స్వయంగా పరిశీలించారు. ప్రజల సహకారం ఎలా ఉందని? నమోదు పూర్తవడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. ఆ వెంటనే సర్పంచ్ ని, వార్డు సభ్యులను పిలిపించారు. పంచాయతీలోని ప్రజలందరితో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మైకుని తీసుకుని మాట్లాడారు. నేను మీ ఎర్రబెల్లి దయాకర్ రావుని, మీ అభిమాన ఎమ్మెల్యేని, మంత్రిని మాట్లాడుతున్న.. అంటూ మొదలు పెట్టారు. ప్రజలంతా దయన్నా! అని అభిమానంగా పిలుచుకునే మంత్రి నేరుగా తమతో మాట్లాడుతుండటంతో.. ఒక్కసారిగా ప్రజలంతా అలర్ట్ అయ్యారు. మంత్రి చెప్పే మాటలన్నీ సావధానంగా విన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రజల ఆస్తుల నమోదు కార్యక్రమానికి సహకరించాలని కోరారు. భద్రత, భరోసా, ఆస్తుల విలువను పెంచడం కోసమే సిఎం కెసిఆర్ ప్రజల ఆస్తులను నమోదు చేయాలని నిర్ణయించారన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాలు, అపోహలున్నా తొలగించకోవాలని చెప్పారు. అలాగే, గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో మంచి స్థానాన్ని సిఎం కెసిఆర్ ఇచ్చారని, ప్రజల అభివృద్ధికే తాను పాటుపడతానని మంత్రి ప్రజలకు వివరించారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటే మంత్రి, ఇలా తమతో మమేకం అవడంతో ఆ గ్రామ ప్రజల ఎంతో సంతోషించారు.
పాలకుర్తి ని కడిగిన ముత్యంలా చేస్తా: మంత్రి ఎర్రబెల్లి
- నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటు పడతా
- జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పిఎంజిఎస్ వై రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గాన్ని కడిగిన ముత్యంలా చేస్తానన్నారు. అలాగే నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడతానన్నారు. సీఎం కేసీఅర్ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ను అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెడ తానన్నారు. నన్ను గెలిపించినందుకు అభివృద్ది చేసి పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు. పాలకుర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ 3 రోడ్ల పనులను పీఎం జీఎస్ వై నిధులతో ఇవాళ శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. మీరు వేసిన ఓట్లతోనే నేను మంత్రిని అయ్యాను మీ(ప్రజల) సహకారం వుంటే ఊహించిన దానికన్నా మించి అభివృద్ది ని చేస్తానన్నారు
కాగా, ఈరవెన్ను కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డా||టీ.రాజయ్య పాల్గొని, మాట్లాడుతూ పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన రోడ్లు ఈ రోజు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఅర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి ల సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.