పన్నులు కట్టండి.. పల్లెల ప్రగతికి పాటు పడండి: మంత్రి ఎర్రబెల్లి

Related image

  • పర్వతగిరి లోని తన నివాసానికి ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • తన ఇంటి,నల్లా పన్నులు కట్టి ప్రజలకు ఆదర్శంగా నిలిచిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు - ఎర్రబెల్లి ట్రస్టు చైర్మన్ పర్సన్ ఉషా దయాకర్ రావులు శనివారం రోజు పర్వతగిరిలోని తన నివాసానికి సంబంధించిన ఇంటి పన్ను, నల్లా పన్నులను 5,220 రూపాయలను గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితర అధికారులకు కట్టి రశీదు తీసుకున్నారు.

గ్రామ పంచాయతీ కి తన ఇంటి, నల్లా పన్నులను కట్టి రాష్ట్రానికి మంత్రి అయినా, తన ఊరులో మాత్రం సామాన్యుడినేనని నిరూపించారు. స్వయంగా ఇంటి పన్ను చెల్లించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా పన్నులు కట్టి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. పన్నులు చెల్లించి, పల్లెల ప్రగతికి పాటుపడండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. సగటు పౌరులు పన్నులు కట్టి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో MPO మధుసూదన్, సోమేశ్వర్ రావు, సంపత్, పంచాయితీ సెక్రటరీ రమేశ్, వార్డు సభ్యుడు యాకాంతం, GP సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More Press Releases