తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి: మంత్రి హరీశ్ రావు
- ఎంసీహెచ్ ఆర్డీలో ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు
- ఐజీఎస్టీ సెటిల్మెంట్ పై ప్రధానంగా చర్చ
- ఈ సమావేశంలో గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యులైన ఢిల్లీ, చత్తీస్ ఘడ్, పంజాబ్, తమిళనాడు, ఓడిస్సా ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు
- తెలంగాణ నుంచి ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యుడిగా మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు
సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కామెంట్స్:
- రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. రాష్ట్రానికి ఎంత ఐజీఎస్టీ రావాల్సి ఉందన్న విషయంపై మాకు స్పష్టత ఉంది.
- రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25 వేల 58 కోట్లు ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ జీఎస్టీ కౌన్సిల్ కు సిఫారసు చేయాలి.
- తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
అందుకు ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కన్వీనర్, బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీ అంగీకారం తెలుపుతూ, రాష్ట్రాలకు ఐజీఎస్టీ మొత్తం ఇవ్వాలన్న సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 2017-2018లో, తిరిగి 2018-2019లో ఇదే తప్పు జరిగిందన్న విషయాన్ని కాగ్ మొన్న పార్లమెంట్ లో బహిర్గతం చేసిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
2018-19లో 13 వేల 944 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం మళ్లీ కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమ చేయడాన్ని కాగ్ మరో మారు తప్పు పట్టిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఆయన తెలంగాణకు ఇందులో 210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ఐజీఎస్టీలో సెటిల్మెంట్ బేస్డ్ ఆన్ ఆన్వల్ రిటర్న్స్ కింద రాష్ట్రానికి మరో వెయి కోట్లు రావాల్సి ఉందన్న మంత్రి హరీశ్ రావు జీఎస్టీ కౌన్సిల్ ఈ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో కోరారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య, పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.