రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి అర్బన్ ఫారెస్ట్ పార్కు లు: తెలంగాణ మంత్రి

Related image

  • కేబీఆర్ పార్కుతో సహా తెరుచుకొనున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు లు
  • అక్టోబర్ 6 నుంచి జూ పార్కులోకి సందర్శకులకు అనుమతి: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేపటి నుంచి అర్బన్ ఫారెస్ట్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నగర పట్టణ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోవిద్ నిబంధనలను అనుసరించి సందర్శకులకు సానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

అదే విధంగా అక్టోబర్ 6 (జూ డే) నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ లోకి సందర్శకులను అనుమతించనున్నట్లు మంత్రి చెప్పారు.
వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ఉన్న చోట నీటిని తొలగించి, పార్కును పూర్తిగా శుభ్రపరచాలని జూ అధికారులను ఆదేశించారు.

అన్ని రాష్ట్రాల అటవీ పర్యావరణ మంత్రుల సమావేశంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అర్బన్ ఫారెస్ట్ పార్కులను  తెరవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కోరిన సంగతి తెలిసిందే.

More Press Releases