ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తీవ్ర దిగ్బ్రాంతి
సుప్రసిద్ద సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసి, సుమారు 40,000 పాటలు ఆలపించిన బాలు భారతీయ ప్రజల అందరికి అభిమాని అయ్యారని అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ ప్రపంచానికి అందించిన సేవలు మరవలేనివని సినీ సంగీత ప్రపంచంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.