హెచ్.డి.ఎఫ్.సి బ్రాంచ్ ని ప్రారంభించిన తెలంగాణ హోం మంత్రి

Related image

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న సుల్తానుల్ ఉలుం రోడ్ లో హెచ్.డి.ఎఫ్.సి బ్రాంచ్ ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 1994 వ సంవత్సరంలో ప్రారంభమైన హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు స్వల్ప కాలంలోనే ఐదు వేలకు పైగా బ్రాంచీలను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు.

ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఆదరణ పొందినట్లయితే మరింతగా విస్తరించే అవకాశం ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా హెచ్.డి.ఎఫ్.సి మరింతగా ప్రజల ఆదరణ పొందాలని ఆయన సూచించారు. సుల్తానుల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ఎండి. వలి ఉల్లా, కార్యదర్శి జాఫర్ జావిద్ ,కార్తికేయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సి.ఎం.డి భగవతి బాల్దేవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Md Mahamood Ali
Telangana

More Press Releases