కరోనా బాధితులకు 24 గంటలూ అందుబాటులో అంబులెన్స్!
- తొర్రూరు పిహెచ్ సి కి వాహనాన్ని అందించిన మంత్రి ఎర్రబెల్లి
- ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించిన మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్
ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిలు మాట్లాడుతూ, కరోనా విస్తరణ పెరుగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి 14 వాహనాలను ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. అందులో పాలకుర్తి నియోజకవర్గానికి రెండు వాహనాలను ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ పరమపదించిన కారణంగా, దేశ వ్యాప్తంగా వారం రోజులపాటు సంతాప దినాలున్నందున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించ కూడదని అన్నారు.
అయినా, మరో వారం రోజుల వరకు ఆగితే, కరోనా బాధితులకు ఇబ్బందులు ఎదురవుతాయని, పైగా ఇది వేడుక కూడా కానందున, కరోనా బాధితులకు సదుపాయంగా ఉంటుందనే లక్ష్యంతోనే ఈ వాహనాన్ని ప్రభుత్వ వైద్యశాలకు అందచేస్తున్నామన్నారు. వాహనాన్ని సద్వినియోగం చేస్తూ, ప్రజలకు ఉపయోగపడే విధంగా చూసుకోవాలని సంబంధిత వైద్యాధికారికి మంత్రులు సూచించారు. అంతకుముందు మంత్రులిద్దరూ మాజీ రాష్ట్ర పతి దివంగత ప్రణబ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను శ్లాఘించారు.
- సేవతోనే జీవితానికి పరమార్థం
- అంబులెన్స్ వాహనాలు ప్రజలకే అంకితం
- ప్రస్తుతం కరోనా బాధితులకు... తర్వాత ప్రజారోగ్యానికి
- కష్ట కాలంలో ప్రజలను ఆదుకున్నవాళ్ళే నిజమైన నేతలు
- పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ వాహనాన్ని అందించిన మంత్రి ఎర్రబెల్లి
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఓట్లప్పుడే కాకుండా, కరోనా వైరస్ విస్తృతి కష్ట కాలంలోనూ ప్రజలను ఆదుకోవాలన్నారు. ఇప్పటి తనకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్లు పంపిణీ చేశామన్నారు. ఇదే తరహాలో ఇప్పుడు తాజాగా ఆక్సీజన్, వెంటిలేటర్లు ఉండే అత్యాధునిక అంబులెన్స్ వాహనాన్ని ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా అందిస్తున్నామని చెప్పారు.
ఈ వాహనం ద్వారా అత్యవసర సేవలు అవసరమైన కరోనా బాధితులను ఆదుకోవాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు. కరోనా అనంతరం ప్రజలకు ఉపయోగించాలని చెప్పారు. టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి 14 వాహనాలను ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. అందులో పాలకుర్తి నియోజకవర్గానికి రెండు వాహనాలను, ఒకటి పాలకుర్తి, రెండోది తోర్రూరులో అందుబాటులో ఉండే విధంగా ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ పరమదించిన కారణంగా లాంఛనంగా వాహనాలను అందచేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. హాస్పిటల్ ని పరిశీలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పోస్టు ఆపరేషనల్ వార్డులోని మహిళలను పరామర్శించారు. ఎలా ఉన్నారని అడిగారు. వాళ్ళకు కెసిఆర్ కిట్లను పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
కరోనా బాధితుల కోసం పాలకుర్తి పిఆర్ ఎఇ నెల వేతనం విరాళం.. ఆదర్శంగా తీసుకోవాలంటూ ఎఇని అభినందించిన మంత్రి:
కరోనా బాధితుల కోసం పాలకుర్తి పంచాయతీరాజ్ ఎఇ మమ్మద్ గౌస్ పాషా తన నెల రోజుల వేతనాన్ని విరాళంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందచేశారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు అందుబాటులో ఉండే విధంగా, పాలకుర్తి సమాజిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ వాహనాన్ని అందించిన సందర్భంగా తన విరాళానికి సంబంధించిన చెక్కుని మంత్రికి పాషా అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఔదార్యాన్ని చాటిన పాషా ని అభినందించారు. తమకు తోచిన విధంగా దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పిఆర్ ఎఇ పాషా మాట్లాడుతూ, కరోనా వైరస్ వచ్చిన కొత్తలోనే మంత్రి దయాకర్ రావు కోట్లాది రూపాయల నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందించారన్నారు. అలాగే ఇప్పుడు మాస్కులు, సానిటైజర్లు అందిస్తుండటమే గాక, అంబులెన్స్ వాహనాలను కూడా ఇస్తున్నందున ఆయనకు ఉడతా భక్తిగా, ప్రజలకు ఉపయోగించడానికి వీలుగా తన నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చామన్నారు. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు.