చారిత్ర‌క మామునూరు ఎయిర్ పోర్టుకు త్వ‌ర‌లో మ‌హ‌ర్ధ‌శ‌!

Related image

  • పునః ప్రారంభానికి న‌డుం బిగించిన తెలంగాణ ప్ర‌భుత్వం
  • ప్ర‌జాప్ర‌తినిధులు, ఎయిర్ పోర్టు అధికారుల‌తో క‌లిసి సంద‌ర్శించిన తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
వ‌రంగ‌ల్, ఆగ‌స్టు 31ః వ‌రంగ‌ల్ మామునూరు ఎయిర్ పోర్టుకు ఎంతో చ‌రిత్ర ఉంద‌ని, ఆ చ‌రిత్ర‌ను తిర‌గ రాస్తూ, పూర్వ వైభవం వ‌చ్చే విధంగా, ఎయిర్ పోర్టుని తిరిగి ప్రారంభించ‌డానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు.

వ‌రంగ‌ల్ మామనూర్ ఎయ‌ర్ పోర్ట్ స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులతో క‌లిసి సోమ‌వారం సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, 1930లో దేశానికి స్వాతంత్ర్యానికి ముందే వ‌రంగ‌ల్ మామునూరు, అతిపెద్ద విమానశ్రయం. ఈ విమానాశ్రయం సిర్పూర్ కాగజ్ నగర్ పేపర మిల్, వరంగల్ లో ఉన్న‌ ఆజం జాహీ మిల్ ల వర్త‌క‌ వాణిజ్య, వ్యాపారా కోసం ప్రత్యేకంగా హైద‌రాబాద్ నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ఇదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర‌ షోలాపూర్ విమానాశ్రయం కూడా క‌ట్టారు. ఈ విమానాశ్రయం 1980 వ ద‌శాబ్దం వరకు దేశ ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు తరుచూ ప్ర‌యాణించే విధంగా ఉండేది. ఇండో – చైనా యుద్ధ‌ సమయంలో ఢిల్లీ విమానశ్రయం లక్ష్యంగా చైనా దాడులు చేసిన సంద‌ర్భంగా మామునూరు విమానాశ్రయం భారత వైమానిక ద‌ళాలకు సేవలు అందించిందని మంత్రి వివ‌రించారు.

కార్గో, వాయుదూత్ ల సేవలకు కూడా ఈ విమానాశ్ర‌యం కేంద్రంగా వినియోగించుకోబడింద‌న్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో నిర్ల‌క్ష్యానికి గురై, వినియోగంలో లేకుండా పోయిన ఈ విమానాశ్ర‌యాన్ని తిరిగి ప్రారంభించాల‌ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం నిర్ణయించింద‌న్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో వరంగల్ ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామ‌న్నారు. మామునూరు ఏర్పాటు కోసం 1140 ఎకరాల స్థలం అవసరం ఉందని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారని, ప్ర‌స్తుతం 700 ఎకరాల స్థలం సిద్ధంగా ఉండగా, మరో 435 ఎకరాల స్థలం రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వంతో ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్ చ‌ర్చించార‌ని, ఎయిర్ పోర్టు అథారిటీ సూచ‌న‌ల ప్ర‌కారం భూ సేక‌ర‌ణ జ‌రిపి, త్వ‌ర‌లోనే ఈ విమానాశ్ర‌యానికి పూర్వ వైభ‌వం తెచ్చే విధంగా కృషి చేస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో క‌రోనా ప‌రిస్థితులు, ఎంజిఎంలో వైద్య‌సేవ‌లు, వ‌ర‌ద‌ల త‌ర్వాత వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నాలాల క‌బ్జాల తొల‌గింపు, న‌ర‌గ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారాల‌పై వ‌రంగ‌ల్ లో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో స‌మీక్షించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు:వ‌రంగ‌ల్, ఆగ‌స్టు 31ః ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వ వైద్యంపై ఎంతో న‌మ్మ‌క‌ముంద‌ని, అందుకే ఎక్క‌డా న‌యం కాని రోగాలతో అనేక మంది ప్ర‌భుత్వ ద‌వాఖానాల‌కే వ‌స్తున్నార‌ని  రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అలాగే చారిత్ర‌క వ‌రంగ‌ల్ ఎంజిఎం హాస్పిట‌ల్ పై మ‌రింత న‌మ్మ‌కం పెరిగే విధంగా వైద్య స‌దుపాయాలు క్ప‌లించ‌డ‌మేగాక‌, ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో బాధితుల‌ను ఆదుకోవ‌డానికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఒక్క‌శాతం కూడా మించ‌ని రోగులు మాత్ర‌మే ప్రైవేట్ హాస్పిట‌ల్స్ ని ఆశ్ర‌యిస్తున్నార‌ని చెప్పారు. 99శాతానికి మించి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ వైద్యాన్నే ఆశ్ర‌యిస్తున్నార‌ని మంత్రి చెప్పారు. ‌

వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో క‌రోనా ప‌రిస్థితులు, ఎంజిఎంలో వైద్య‌సేవ‌లు, వ‌ర‌ద‌ల త‌ర్వాత వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నాలాల క‌బ్జాల తొల‌గింపు, న‌గ‌ర స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారాల‌పై వ‌రంగ‌ల్ లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, సీపీ ప్ర‌మోద్ కుమార్, ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించిన అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు.

వ‌రంగ‌ల్ ఎంజిఎంలో ప్ర‌స్తుతం 340 ప‌డ‌క‌లు అందుబాటులో ఉండ‌గా, అందులో 134 ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయి.60 వెంటిలేట‌ర్లు ఉండ‌గా, కేవ‌లం 4 వెంటిలేట‌ర్ల పై మాత్ర‌మే క‌రోనా బాధితులున్నారు. 88 ఆక్సీజ‌న్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం 129 మంది క‌రోనా బాధితులు, 77 మంది సారీ పేషంట్లు కలిపి మొత్తం 206 మంది మాత్ర‌మే ఎంజిఎంలో చికిత్స పొందుతున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు. త్వ‌ర‌లోనే 100 వెంటిలేట‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. ఎంజిఎంలో ఇంకా క‌రోనా బాధితుల‌కు స‌రిప‌డా స‌దుపాయాలున్నందున‌, పిఎంఎస్ఎస్ వై హాస్పిట‌ల్ ని సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ గా తీర్చిదిద్ది నెల రోజుల్లోగా సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు.

రోగుల‌కు మ‌రింత న‌మ్మ‌కం క‌లిగే విధంగా వైద్యులు, సిబ్బంది ప‌నిచేయాల‌ని మంత్రి ఆదేశించారు. ప్ర‌జ‌లు కూడా ఎవ‌రో చెప్పే మాట‌లు విశ్వ‌సించ‌వ‌ద్ద‌ని, ఉచింతంగా అందే ప్ర‌భుత్వ వైద్యంపై న‌మ్మ‌కం పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.ప్ర‌జ‌ల్లో మ‌రింత న‌మ్మ‌కం పెరిగేలా వైద్యులు, సిబ్బంది ప‌ని చేయాల‌ని ఆదేశించారు.

కాగా, వ‌ర‌ద ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చాక ప్ర‌జాభీష్టం మేర‌కు నాలాల క‌బ్జాల కూల్చివేత ప్రారంభ‌మైంద‌న్నారు. 27కి.మీ. పొడ‌వునా విస్త‌రించిన న‌గ‌ర ప్ర‌ధాన నాలాల‌పై క‌బ్జాల‌ను తొల‌గించేందుకు 4 టీమ్స్ ప‌ని చేస్తున్నాయ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 23 క‌బ్జాల‌ను తొల‌గించామ‌ని మంత్రి వివ‌రించారు. మిగ‌తా వాటిని యుద్ధ ప్రాతిప‌దిక‌న 10 రోజుల్లోగా కూల్చివేయాల‌ని, అవ‌స‌ర‌మైతే కూల్చివేత‌ల‌కు యంత్రాల‌ను విరివిగా వినియోగించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌ను ఆదేశించారు. నాలాల్లో పేరుకుపోయిన‌ చెత్తా చెదారం తొల‌గించి, శుభ్రం చేయాల‌ని సూచ‌న‌లు చేశారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో త‌క్ష‌ణ స‌హాయానికి సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు చొర‌వ తీసుకుని మంజూరు చేసిన రూ.25కోట్ల‌కు వెంట‌నే త‌గిన‌ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

అలాగే, రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు కార్పొరేష‌న్ నిధుల‌ను వినియోగించుకోవాల‌ని చెప్పారు. వ‌రంగ‌ల్ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారాల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ఆదేశించారు. సెప్టెంబ‌ర్ 4వ తేదీన వ‌రంగ‌ల్ న‌గ‌రాన్నిసందర్శించి‌, నాలాల ప‌రిశీంచి, తిరిగి స‌మీక్ష చేస్తామ‌ని, అప్ప‌టిక‌ల్లా పూర్తి వివ‌రాల‌తో అధికారులు సిద్ధ‌మై రావాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు.

4 అంబులెన్స్ వాహ‌నాల‌ను ప్రారంభం: వ‌రంగ‌ల్, ఆగ‌స్టు 31ః రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా, స్మైల్ ఎ గిఫ్ట్ లో భాగంగా వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా నుంచి ఇచ్చిన 14 అంబులెన్స్ వాహ‌నాల్లో 4 వాహ‌నాల‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ తో క‌లిసి సోమ‌వారం వ‌రంగ‌ల్ లోని త‌న క్యాంపు కార్యాల‌యం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, కెటిఆర్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని, క‌రోనా బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు వీలుగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి 14 అంబులెన్స్ వాహ‌నాల‌ను ఎమ్మెల్యేలు, మేయ‌ర్ త‌దిత‌రులంతా క‌లిసి ఇచ్చార‌న్నారు. వాటిని ఇటీవ‌లే కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించామ‌ని, అయితే, వ‌రంగ‌ల్ లో ఈ రోజు 4 వాహ‌నాల‌ను ప్రారంభించినట్లు చెప్పారు. అందులో ఒక‌టి భూపాల‌ప‌ల్లి, జ‌న‌గామ‌, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వాహ‌నాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు.

భూపాల‌పల్లి వాహ‌నాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జ‌న‌గామ వాహనాన్ని మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, పాల‌కుర్తి వాహ‌నాల‌ను ఒద్దిరాజు ర‌విచంద్ర‌, సంతోశ్ రెడ్డిలు ఇచ్చార‌ని, వారికి మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మిగ‌తా వాహ‌నాలు కూడా త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

More Press Releases