ప్రధాన నాలాల వల్ల కుడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: తెలంగాణ ఉప సభాపతి
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రధాన నాలాల వల్ల కూడా ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు జరిపామని, 50 సంవత్సరాల కాలంలో చేపట్టని కేవలం ఐదేళ్ళ కాలంలో పూర్తిచేస్తున్నామని తెలంగాణ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్ పరిధిలో రూ.1.28 కోట్ల ఖర్చుతో చేపట్టిన నాలా పై కొత్త స్లాబ్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులను తీగుల్ల పద్మారావు సోమవారం ప్రారంభించారు. స్థానిక corporator ధనంజన బాయి గౌడ్, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, ghmc ఉప కమీషనర్ మోహన్ రెడ్డి, అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రసంగించారు.
ఉపసభాపతి కామెంట్స్:
- సికింద్రాబాద్ లోని పలు జనావాసాలు నాలాలకు అనుకొని వెలిశాయి. అయినప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరిపాము. నాలా పై స్లాబ్ల్ పునర్నిర్మాణం పనులను ఇటీవలి కాలంలో చేపట్టాము.
- కౌసర్ మసీదు నాలా పై స్లాబ్ నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించాము. పనులలో తోలి దశ పూర్తయ్యాయి. ఇందిరానగర్, బ్రాహ్మణ బస్తి, ఆదర్శా కాలనీ, తార్నాక, అశోక్ నగర్ ప్రాంతాల్లో వర్షపు నీటి వల్ల నాలా పరివాహ ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కోట్ల రూపాయల మేరకు నిధులను కేటాయించాము.
- నాలా పై ఉన్న కల్వర్టులు కుడా కాలం చెల్లి శిధిలంగా మారడం, నాలా నీటి ప్రవాహానికి చిన్న పాటి కల్వర్టులు అడ్డంకిగా ఉండడం వంటి పరిస్థితుల నివారణకు మేము గత ఐదు సంవత్సరాల్లో జరిపిన ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇచ్చాయి. లాలాపేట, అన్న నగర్, మహమ్మద్ గూడా, ఫ్రైడే మార్కెట్, అశోక్ నగర్ కల్వర్ట్ లను ఇట్టేవలి కాలంలో వెడల్పు చేశాము. పెద్ద వర్షాలకు సైతం ప్రజలు ఏ ఇబ్బంది లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మేము ఐదేళ్ళ కాలంలో చేపట్టిన ఏర్పాట్ల వల్ల లాలాపేట, చంద్రబాబు నగర్, ఇందిరా లక్ష్మి నగర్, సిరిపురి కాలని, భవానీ నగర్, అన్నా నగర్, మహమ్మద్ గూడా, ఎల్నారాయణ నగర్, పుల్లయ్య బావి, వంటి ప్రాంతాలు సురక్షిత ప్రాంతాలుగా మారాయి. రానున్న మూడేళ్ళ వ్యవధిలో సికింద్రాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. గత ఐదేళ్ళ కాలంలో ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు మొదలుకొని అన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తవుతాయి.