త్యాగానికి ప్రతీక మొహర్రం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

Related image

  • ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంటికే పరిమితం అవుదాం
మంచి తనానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం కార్యక్రమాల వేళ అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్  ఆకాంక్షించారు. ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగానికి గుర్తుకు మొహర్రం జరుపుకుంటున్నామని, ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలని గవర్నర్ పేర్కొన్నారు. కరోనా వేళ రాష్ట్రంలోని ముస్లిం సోదరులు తమ నివాసాలలోనే ఉండి మొహర్రం కార్యక్రమాలను పూర్తి చేయాలని, ప్రభుత్వం, సుప్రీం కోర్టు సూచించిన మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

Biswabhusan Harichandan

More Press Releases